బాలీవుడ్ ఇండస్ట్రీ క్రేజీ హీరోయిన్ అలియా భట్ చాల ఖచ్చితంగా మాట్లాడుతుంది. తన మనసులో ఏది అనుకుంటే అది పైకి వ్యక్తపరచగల ఈమెకు ‘ఆర్ ఆర్ ఆర్’ లో అవకాశం వచ్చినప్పుడు మొదట్లో రాజమౌళిని ఆకాశానికి ఎత్తేసింది. ఈసినిమా ప్రమోషన్ లో చాల యాక్టివ్ గా పాల్గొన్న అలియా భట్ ఈమూవీ విడుదల అయ్యాక రాజమౌళి పై కోపాన్ని పెంచుకుని ఈసినిమా సక్సస్ మీట్ లకు అలాగే మీడియా సమావేశాలకు చాల దూరంగా ఉంది.
దీనికి కారణం ‘ఆర్ ఆర్ ఆర్’ లో ఆమె పాత్రను కేవలం 10 నిముషాలకు మాత్రమే కుదించడం. ఈవిషయంలో తన అసహనాన్ని అలియా భట్ రాజమౌళికి స్వయంగా ఫోన్ చేసి చెప్పింది అని కూడ అంటారు. అయితే ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ప్రమోషన్ కు వచ్చేసరికి అలియా భట్ కు జక్కన్న పై ఏర్పడ్డ కోపం అంతా తగ్గిపోయి అతడిని ఆమె హీరోగా మార్చేసింది.
భాగ్యనగరంలో జరిగిన ఒక మీడియా సమావేశంలో అలియా మాట్లాడుతూ తనకు ‘ఆర్ ఆర్ ఆర్’ లో నటించే అవకాశం ఇచ్చినందుకు రాజమౌళికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ‘ఆర్ ఆర్ ఆర్’ తన పాత్ర కేవలం పది నిముషాలకే పరిమితం అయినప్పటికీ తన పాత్ర ‘ఆర్ ఆర్ ఆర్’ లో అత్యంత కీలకం అని అభిప్రాయ పడింది. ఇక తెలుగు రాష్ట్రాలలో అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలలో ‘బ్రహ్మాస్త్ర’ మూవీకి ఈ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది అంటే అది రాజమౌళి ఈమూవీకి సమర్పడుగా వ్యవహరిస్తూ ప్రమోట్ చేయడం వల్లనే అంటూ తన దృష్టిలో రియల్ హీరో రాజమౌళి నే అంటూ కామెంట్స్ చేసింది.
దీనితో అలియా భట్ కు రాజమౌళి పై ఏర్పడ్డ కోపం పూర్తిగా తగ్గి పోయిందా అంటూ మీడియా వర్గాలు ఆశ్చర్యపోయాయి. అందుకే రాజకీయాలలో అదేవిధంగా సినిమాలలో శాశ్విత మిత్రులు శాశ్విత శతృవులు ఉండరు అనడానికి అలియా భట్ కామెంట్స్ మరొకసారి రుజువు చేసాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి