మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించిన చిరంజీవి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే చిరంజీవి ఈ సంవత్సరం ఇప్పటికే ఆచార్య మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు ఆయన కొరటాల శివ 'ఆచార్య' మూవీ కి దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటించాడు.

ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం ఆచార్య మూవీ తో ప్రేక్షకులను పలకరించిన చిరంజీవి ప్రస్తుతం వరుస మూవీ లలో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం చిరంజీవి 'గాడ్ ఫాదర్' అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొంత కాలం క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి ఒక టీజర్ ని మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.

ఇప్పటి వరకు ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలలో మెగాస్టార్ చిరంజీవి తన స్టైలిష్ లుక్ తో ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళ్తే ... ఈ మూవీ కోసం చిత్ర బృందం రెండు భారీ ఈవెంట్ లను ఏర్పాటు చేయనున్నట్లు, అందులో ఒకటి అనంతపురంలో , మరొకటి ముంబై లో ఇలా రెండు ఈవెంట్ లను భారీ ఎత్తున నిర్వహించడానికి చిత్ర బృందం ఇప్పటికే సన్నాహాలు చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: