ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు రూపొందుతున్నాయి. వాటిలో ముందుగా ప్రేక్షకుల ముందుకు ఆది పురుష సినిమా రాబోతుంది. బాలీవుడ్ లో రూపొందిన ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కగా వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయబోతున్నారని అధికారిక ప్రకటన ఇప్పటికే ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయడానికి చిత్ర బృందం రంగం సిద్ధం చేస్తుంది.

ఇప్పటికే ఈ సినిమాను పూర్తి చేసిన ప్రభాస్ ఇప్పుడు సలార్ మరియు ప్రాజెక్టు కే సినిమా షూటింగ్ల లో పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్లను ఒకేసారి చేస్తూ వీటిని ఈ ఏడాదిలో పూర్తి చేసే విధంగా ప్లాన్ చేశాడు. ప్రశాంత నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సలార్ చిత్రాన్ని ఎప్పుడో మొదలుపెట్టిన ప్రభాస్ దానిని చివరి వరకు తీసుకువచ్చాడు. మాస్ ను టార్గెట్ చేస్తూ రూపొందిన ఈ చిత్రాన్ని ముందుగా పూర్తి చేయాలని చెప్పి ప్రాజెక్టు కే సినిమా యొక్క షూటింగ్ ను కొన్ని రోజులు ఆపేసాడు అని తెలుస్తుంది.

ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయాలని ప్రభాస్ భావిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణ యం తీసుకున్నాడట. ఈ ఏ డాది ఈ సినిమాను పూర్తి చేసిన తర్వాత వచ్చే ఏడాది ఫ్రెష్ గా ప్రాజెక్టు కే సినిమాను చేయాలని ఆయన భావిస్తున్నాడు. మరి రెండు వరస ప్లాపు ల తర్వాత మూడు భారీ సిని మాలతో ప్రేక్షకుల ను అందించబోతున్న ప్రభాస్ వాటి ద్వారా ఎంతటి స్థాయి ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి. ఈ మూడు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో స్పిరిట్ అనే సినిమాను చేయబోతున్నాడు. అలాగే బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం లో కూడా ఓ సినిమా చేయడానికి ప్రభాస్ ఒప్పుకున్నాడని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: