ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాల్లో సీతారామం సినిమా ముందు వరుసలో ఉంటుంది అని చెప్పాలి.ఈ సినిమాలో సీత పాత్రలో నటించిన మృణాల్ ఠాకూర్ అభినయానికి ప్రేక్షకులు ముగ్ధులైపోయారు.ఇక  సీతారాముల్లా ఇద్దరూ చక్కగా నటించారన్న ప్రశంసలు దక్కాయి. అయితే సీతారాముల బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఏ సినిమా హిట్ అవుతుందనడానికి సీతారామం సినిమానే నిదర్శనం. ఈ సినిమాకి సంబంధించి యూట్యూబ్ లో ఒక సీన్ ని అప్ లోడ్ చేశారు చిత్ర నిర్మాతలు. అయితే ఆ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

ఇక ఇంత మంచి సీన్ ని ఎందుకు డిలీట్ చేశారని బాధపడుతున్నారు ఫ్యాన్స్.కాగా  నిడివి ఎక్కువ అయిన సందర్భంలో సినిమాల్లోని కొన్ని సీన్స్ ని తొలగించడం అనేది మామూలే. ఈ సినిమాలో మిస్ అయిన సీన్స్ ని చూసే అవకాశం యూట్యూబ్ లో ఉంటుంది. ఇక దర్శక, నిర్మాతలు ఆ తొలగించిన సీన్స్ ని సినిమా రిలీజైన కొన్ని రోజులకి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారు.అయితే ఆ సీన్స్ కూడా బాగా హిట్ అవుతాయి.ఇక  లక్షల్లో వ్యూస్ వస్తాయి.ఇకపోతే  ఆ సీన్స్ చూసినప్పుడు.. ఈ సీన్ బాగుంది కదా, ఎందుకు తొలగించారబ్బా.. ప్చ్ అని అనుకుంటాం. 

 లెంత్ ప్రాబ్లమ్ అని మనం కూడా అర్ధం చేసుకోవాలిగా. ఇదిలావుంటే తాజాగా సీతారామం సినిమాకి సంబంధించి తొలగించిన సీన్ ని అప్ లోడ్ చేశారు. వైజయంతి నెట్వర్క్ యూట్యూబ్ ఛానల్ లో ఈ సీన్ ని అప్ లోడ్ చేశారు. అంతేకాదు ఆ మధ్య రష్మిక పాత్రకి సంబంధించి ఒక తొలగించిన సీన్ ని అప్ లోడ్ చేశారు.ఇక దానికి 3 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ లో దుల్కర్ సల్మాన్, సుమంత్ ల మధ్య వచ్చే సీన్ ని అప్ లోడ్ చేశారు. ఇక అప్ లోడ్ చేసిన 4 గంటలకే 4 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే ఈ సీన్ ఇంకా ఎమోషనల్ గా ఉంటుంది.కాగా  ఈ సీన్ ఉండి ఉంటే వేరేలా ఉండేదని, ఇంకా పెద్ద హిట్ అయి ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: