యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సలార్ సినిమా సెట్స్ మీద ఉంది. కె.జి.ఎఫ్ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. కె.జి.ఎఫ్ 1,2 సినిమాలతో ప్రశాంత్ నీల్ తన సత్తా చాటగా సలార్ తో మరోసారి పాన్ ఇండియా లెవల్ లో దుమ్ముదులపాలని చూస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో ప్రశాంత్ నీల్ చేస్తున్న సలార్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

సలార్ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలంస్సిటీలో జరుగుతుంది. ఈ షూటింగ్ లో భాంగా ప్రభాస్ కి సంబందించిన ఒక వీడియో లీక్ అయ్యింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సలార్ లో ప్రభాస్ ఊర మాస్ లుక్ తో కనిపిస్తున్నారు. ప్రభాస్ తప్పకుండా ఈ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొడతాడని అంటున్నారు.

సలార్ సినిమా కోల్ మైన్ కాన్సెప్ట్ తో వస్తుంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఇద్దరు ఈ సినిమాకి ది బెస్ట్ ఇచ్చేస్తున్నారని తెలుస్తుంది. కె.జి.ఎఫ్ రెండు పార్ట్ లతో తన డైరక్షన్ టాలెంట్ ఏంటన్నది చూపించిన ప్రభాస్ లేటెస్ట్ గా సలార్ తో దానికి మించిన ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ఇక ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా షూటింగ్ పూర్తి చేసుకుని 2023 సమ్మర్ లో రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నారట. మరి ఈ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఇక దీనితో పాటుగా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా 2023 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఆ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నారు. సినిమాలో కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుంది. రావణాసురుడిగా సైఫ్ అలి ఖాన్ నటిస్తున్నారు. ఓం రౌత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ త్వరలో రిలీజ్ కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: