హీరో గోపీచంద్ డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం లౌక్యం. వీరి కాంబినేషన్లో అంతకుముందు లక్ష్యం సినిమా కూడా రావడం జరిగింది. ఈ సినిమా అప్పటికె గోపీచంద్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక లౌక్యం సినిమా లో హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ నటించింది. ఇక ఈ సినిమా 2014 వ సంవత్సరంలో సెప్టెంబర్ 26న విడుదల అయింది మొదటి షో తోనే సూపర్ హిట్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పటికీ విడుదల ఎనిమిది సంవత్సరాలు అవుతొంది. ఇదంతా ఇలా ఉండక ఈ సినిమా మొత్తం మీద ఎంతటి కలెక్షన్లను రాబట్టిందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

1). నైజాం-7.38 కోట్లు రూపాయలు.
2). సీడెడ్ -2.90 కోట్లు రూపాయలు.
3). ఉత్తరాంధ్ర -2.70 కోట్లు రూపాయలు.
4). ఈస్ట్ -1.30 కోట్లు రూపాయలు.
5) వెస్ట్ -1.2 కోట్లు రూపాయలు.
6). గుంటూరు-1.85 కోట్లు రూపాయలు.
7). కృష్ణ-1.32 కోట్లు రూపాయలు.
8). నెల్లూరు -70 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.19.70  కోట్ల రూపాయలు.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా+తమిళనాడు-1.92 కోట్ల రూపాయలు.
11). ఓవర్సీస్-75 లక్షలు
12). ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే రూ.21.84 కోట్ల రూపాయలు.

లౌక్యం సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.18 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉండగా ఈ చిత్రం పూర్తి అయ్యేసరికి రూ.21.84 కోట్ల రూపాయలను రాబట్టింది చివరిగా ఈ సినిమా బయ్యర్లకు దాదాపుగా రూ.3.84 కోట్ల రూపాయల లాభాన్ని తెచ్చిపెట్టింది. అయితే గోపీచంద్ 8 ఏళ్లలో నటించిన ఏ సినిమా కూడా ఇంతటి కలెక్షన్లను రాబట్టలేదు. ఇక చివరిగా ఈ సినిమాతోని మంచి విజయాన్ని అందుకున్నారు గోపీచంద్ ఇక ఆ తర్వాత నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం గోపీచంద్ పలు సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇక గోపీచంద్ ఏ సినిమాలో అయినా తనకి క్యారెక్టర్ నచ్చితే విలన్ గా చేయడానికి సిద్ధమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: