పాన్ ఇండియా స్టార్ హీరోగా ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ప్రతి చిత్రం కూడా ఒక క్రేజీ ప్రాజెక్టు అని చెప్పవచ్చు. అలాంటి వాటిలో సలార్ చిత్రం కూడా ఒకటి ఇ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా నీ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రభాస్ అభిమానులు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన షెడ్యూల్ కూడా హైదరాబాదులో ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రభాస్ మోకాలికి శస్త్ర చికిత్స కారణంగా కొద్ది రోజులపాటు షూటింగ్ కూడా బ్రేక్ ఇచ్చారు. ఆ తరువాత ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మరణంతో మరికొద్ది రోజులు సినిమా షూటింగ్ ఆగిపోయిందని చెప్పవచ్చు.అయితే ఇప్పుడు తిరిగి మళ్ళీ రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది.అయితే కృష్ణంరాజు మరణం తర్వాత ఈ సినిమా ప్లాన్ ఒక్కసారిగా మారిపోయినట్లు తెలుస్తోంది ఈ సినిమాని ఒకే పార్టుగా చేయాలనుకున్నారట అయితే ఈ సినిమా కదా డివైడర్ బట్టి రెండు భాగాలుగా చేయాలని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇందుకోసం షూటింగ్ షెడ్యూల్స్ ని పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. దీంతో ఈ సినిమా ప్లాన్స్ ను ఇప్పుడు పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయట. సలార్ సినిమా షూటింగ్ రెండు వారాలు లేటు కావడంతో షూటింగ్ షెడ్యూల్లో భారీ మార్పులు వచ్చినట్లుగా తెలుస్తోంది.ఇక మొదటి పార్ట్ ని వచ్చే యేడాది సెప్టెంబర్ 28న భారీ స్థాయిలో ఒకేసారి ఐదు భాషలలో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో అని అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక గడిచిన కొద్ది గంటల క్రితం ఆది పురుష్ సినిమా డైరెక్టర్  ఓం రౌత్ ఈ సినిమా టీజర్ ను త్వరలోనే విడుదల చేస్తానని అప్డేట్ ను కూడా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: