గత కొంతకాలంగా బంగారం ,వెండి ధరలు ఆకాశమే హద్దు అన్నట్లుగా దూసుకు వెళ్తున్నాయి. అయితే ఎట్టకేలకు ఆ ధరలకు బ్రేక్ పడింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున బంగారం ధరలు దిగిరావడంతో కొనుగోలుదారులకు కూడా ఉరట కలిగిస్తోంది. నిన్న ఒక్కరోజే కేవలం  రూ.3000 రూపాయలకు పైగా దిగిరాగా గత మూడు రోజులలో ఏకంగా 6000 నుంచి  7వేల రూపాయలకు పైగా బంగారం తగ్గుముఖం పట్టింది. ఇక వెండి ధరల విషయానికి వస్తే మంగళవారం ఒక్కరోజే వెండిపైన ఏకంగా రూ .18 వేల రూపాయల వరకు తగ్గింది.


డిసెంబర్ 31న దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,36,190 రూపాయలో ఉండగా అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,840 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే దేశీయంగా వెండి కిలో ధర విషయానికి వస్తే రూ. 2,39,900 వద్ద కొనసాగగా గత మూడు రోజుల క్రిందట ధరతో పోలిస్తే ఇప్పటివరకు రూ .19,000 వరకు తగ్గింది. హైదరాబాదులో కిలో వెండి ధర రూ. 2,57,900 రూపాయల కొనసాగుతోంది.

బంగారం విషయానికి వస్తే హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,36,200 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,24,850 రూపాయలు


విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,36,200 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,24,850 ఉన్నది.


చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,37,460 రూపాయలు ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,26,000 వద్ద కొనసాగుతోంది.


ఈ ఏడాదిలో వెండి సుమారుగా 138%, బంగారం ధర 75% వరకు పెరిగినట్టుగా నిపుణులు చెబుతున్నారు. ఇంతటి లాభాలు వచ్చిన తర్వాత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సైతం వెనక్కి తీసుకోవడం వల్లే ధరలలో ఒక్కసారిగా ఇంత తగ్గుదల కనిపించిందని చెబుతున్నారు. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టిన రాబోయే రోజుల్లో మళ్లీ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: