ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో విడాకుల మాట ఎక్కువగా వినిపిస్తోంది.చాలామంది జంటలు ఎన్నో రోజులుగా కలిసి జీవించి కేవలం చిన్నచిన్న కారణాలతో విడాకుల బాట పడుతున్నారు.ముఖ్యంగా ప్రేమ వివాహం చేసుకున్న వారు ఎక్కువగా విడాకుల వైపు మొగ్గు చూపిస్తున్నారు.ఎంత త్వరగా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారో అంతే త్వరగా గొడవల వల్ల విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. వీరి నిర్ణయాలతో చాలామంది అభిమానులు ఇదేంటి వీళ్లు ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకొని ఇలా విడాకులు తీసుకుంటున్నారు అంటూ బాధ పడుతున్నారు.ఇక ఇదే నిర్ణయం తీసుకుంది ఓ యంగ్ జంట. ఇక వాళ్ళు ఎవరో కాదు కాజల్ అగర్వాల్ సొంత చెల్లి అయిన నిషా అగర్వాల్.


ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీస్ విడాకుల బాటపట్టారు. ఇక ఇదే జాబితాలో కి వెళ్తా అంటోంది నిషా అగర్వాల్. ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ కాజల్ తో పోల్చుకుంటే తన పర్ఫామెన్స్ అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవడంతో ఆమెను హీరోయిన్ గా ఆదరించలేకపోయారు. దాంతో సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని నిర్ణయించుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే 2013 డిసెంబర్లో నిషా అగర్వాల్ బిజినెస్ మ్యాన్ అయినా మాన్ కరణ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఒక బాబు కూడా పుట్టారు..


ఎన్నో రోజులుగా సాఫీగా సాగిపోతున్న వీరి జీవితంలో ఏవో అనుకోని మనస్పర్థలు వచ్చి భర్తతో విడాకులు తీసుకోవడానికి రెడీ అయిపోయిందట నిషా అగర్వాల్. ఇక త్వరలోనే విడాకుల గురించి అఫీషియల్ ప్రకటన చేయనుందనే ఒక క్రేజీ రూమర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. అయితే ఈమె పై వస్తున్న ఈ రూమర్ పై ఇప్పటి వరకు కాజల్ గాని,నిషా అగర్వాల్ గాని,ఆమె బంధువులు గాని ఎవరు స్పందించకపోవడంతో ఈ వార్త నిజమేనేమో అని చాలామంది భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వారి నుంచి క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: