మల్లేశం చిత్రంతో హీరోయిన్గా తన కెరీర్ ని ప్రారంభించినది హీరోయిన్ అనన్య నాగళ్ళ. తొలి చిత్రంతోనే పరవాలేదు అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం అనన్య నాగళ్ళ పలు క్రేజీ ప్రాజెక్టులలో కూడా నటిస్తూ ఉన్నది. ఇక ఇటీవలే తను తమిళ సినిమా షూటింగ్లో కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇక నిత్యం సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇలా క్రేజీ సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే వివాహం చేసుకోబోతోందనే వార్తలు వినిపించాయి. ఈ విషయంపై అనన్య నాగళ్ళ క్లారిటీ ఇవ్వడం జరిగింది వాటి గురించి చూద్దాం.


అనన్య నాగళ్ళ త్వరలోనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది అంట వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికపై క్లారిటీ ఇవ్వడం జరిగింది. తన పెళ్లిపై వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని తెలియజేసింది. అంతేకాకుండా ఆ పెళ్ళికొడుకు పేరు పెళ్లి తేది చెప్పాలంటు సోషల్ మీడియాలో ఒక ట్విట్ కూడా చేయడం జరిగింది. అబ్బాయిలు నాకోసం వరుడుని ఎంపిక చేసుకున్నందుకు ధన్యవాదాలు. కానీ దయచేసి ఆ పెళ్లి తేదీ తో పాటు ఆ పెళ్ళికొడుకు ఎవరో కూడా నాకు చెప్పండి అంటూ అప్పుడే తన వివాహానికి హాజరయ్యే అవకాశం ఉందని తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.


దీంతో అనన్య నాగళ్ళ పెళ్లి లేదని విషయంపై క్లారిటీ ఇచ్చింది.అనన్య నాగళ్ళ శాకుంతలం సినిమాలో కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కూడా భారీ అంచనాల మధ్య నవంబర్ 4వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్నది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేసిన ట్వీట్ కాస్త వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: