ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప తో పాన్ ఇండియా లెవల్లో రష్మిక క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.ఇక  దక్షిణాదిలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.అయితే ప్రస్తుతం హీందీలో మూడు ల్లో నటిస్తోంది నేషనల్ క్రష్.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ తో కలిసి గుడ్ బై లో నటించింది. అలాగే సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మిస్టర్ మజ్ను, రణబీర్ కపూర్ జోడిగా యానిమల్ చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఇందులో ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యింది గుడ్ బై చిత్రం. 

ఇదిలావుంటే ఇటీవల విడుదలైన ఈ ట్రైలర్ ఆకట్టుకుంది. ఇక ఈ ప్రమోషన్లలో పాల్గోంటున్న రష్మిక.. తన మాజీ భాయ్ ఫ్రెండ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న రష్మికను.. ఏదైనా పార్టీలో మీ మాజీ భాయ్ ఫ్రెండ్ ఎదురుపడితే ఏం చేస్తారు అని అడగ్గా.. తనకు హాయ్ చెబుతానని తెలిపింది.ఇక  “వారితో నేను ఇప్పటికీ స్నేహంగానే ఉన్నాను. అంతేకాదు మేము మంచి స్నేహితులం. అలాగే.. వారి కుటుంబంతో గతంలో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి.  భవిష్యత్తులో కూడా ఉండాలని కోరుకుంటున్నాను.

అయితే  వారితో నాకు చాలా మంచి అనుబంధం ఉంది ” అంటూ చెప్పుకొచ్చింది.కెరీర్ ఆరంభంలో రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆమె తొలి కిరిక్ పార్టీ చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో 2017లో నిశ్చితార్థం జరిగింది. అయితే ఇక  వెంటనే ఏడాదిలోనే వీరిద్దరు విడిపోయారు. ఇక ఆ తర్వాత రష్మికకు తెలుగులో వరుస ఆఫర్లు తలుపు తట్టాయి.ఇకపోతే  గీతా గోవిందం, డియర్ కామ్రేడ్, ఛలో, ఆడవాళ్లు మీకు జోహార్లు, పుష్ప వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: