సాదారణంగా సినీ ఇండస్ట్రీలో కొందరి నటనకు ఎవరైనా ఫిధా అవ్వాల్సిందె..ముఖ్యంగా హీరోల నటనకు హీరోయిన్లు ఫిధా అవ్వడం కామన్..తాజాగా మరో హీరోయిన్ అ లిస్టు లోకి వచ్చింది.ఆమె గురించి కొన్ని విషయాలు..ఫార్చ్యూన్ ఫోర్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘స్వాతిముత్యం’.గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విభిన్న కథాంశంతో వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా బుధవారం (అక్టోబర్ 5న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర కథానాయిక వర్ష బొల్లమ్మ విలేఖర్లతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

 

పాత్రల పరంగా చూస్తే నా పాత్ర కొంచెం డామినేటింగ్ గా ఉంటుంది. గణేష్ పాత్ర చాలా అమాయకంగా ఉంటుంది. నేను పోషించిన భాగ్య లక్ష్మి పాత్ర ఒక స్కూల్ టీచర్. ఆ పాత్రకు తగ్గట్లు కొంచెం పెత్తనం చూపిస్తాను.నిజాయితీగా చెప్పాలంటే ఇది మొదట సితార ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పారు. ఆ తర్వాత కథ చెప్పారు. సితార లాంటి పెద్ద సంస్థలో అవకాశం అనగానే చేయాలనుకున్నాను. అయితే కథ విన్నాక చాలా నచ్చింది. ఖచ్చితంగా చేయాలి అనిపించింది.నాకు ఇలా సహజత్వానికి దగ్గరగా ఉండే కథలు అంటే ఇష్టం. ఈ కథలో కొత్తదనం ఉంది. పాత్రలలో చాలా లోతు ఉంది. కథా కథనాలు ఆసక్తికరంగా ఉంటాయి.


చాలా మంది అడుగుతుంటారు. ఎక్కువగా హీరోల సోదరులతో చేస్తారు ఎందుకు అని. నేను కావాలని ఎంపిక చేసుకోలేదు. అది అలా కుదురుతుంది అంతే. ఇప్పుడు వస్తున్న యువ హీరోలు మంచి సబ్జెక్టులతో వస్తున్నారు. నన్ను తీసుకోవడానికి అది కూడా కారణమై ఉండొచ్చు.అని అమ్మడు చెప్పుకొచ్చింది.ఇంకాఈ అమ్మాయి ఇలాంటి పాత్ర కూడా చేస్తుందా అని అనుకునే లాంటి పాత్ర చేయాలని ఉంది. ప్రతినాయిక ఛాయలు ఉన్న సైకో పాత్ర దొరికితే బాగా చేయగలనని నాకు నమ్మకం ఉంది.చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ గౌరవం ఇస్తారు. మేకప్ మ్యాన్, లైట్ బాయ్ ఇలా అందరికీ వెంటనే డబ్బులు ఇస్తారు. నేను చేయకముందే సితార గురించి గొప్పగా విన్నాను. చేస్తున్నప్పుడు అది నిజమని అర్థమైంది. సితార లో పని చేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది...ఇకపోతే మొదటి నుంచి నేను ఎన్టీఆర్ కి పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చింది.. అతని సినిమా లో నటించె ఛాన్స్ వస్తే నాకన్నా అదృష్ట వంతులు వుండరు అని ఆమె చెప్పుకొచ్చింది..


మరింత సమాచారం తెలుసుకోండి: