కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన ధనుష్ నటించిన తాజా చిత్రం నానే వరువెన్ ఈ చిత్రాన్ని తెలుగులో మాత్రం నేనే వస్తున్నా చిత్రం పేరుతో విడుదల చేశారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మిగతా సమర్పణలో తెలుగులో విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా మొదటి నుంచి మంచి హైట్ ను సొంతం చేసుకున్నది. గత నెల 29వ తేదీన ఈ సినిమా విడుదల అయ్యి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో మళ్లీ ధనుష్ ఒక డల్ రోల్ లో కనిపించారు. ముఖ్యంగా ఈ చిత్రం నెగటివ్ రోల్ లో తన విశ్వరూపాన్ని చూపించారు ధనుష్.ఇక ఈ చిత్రాన్ని ధనుష్ అన్న సెల్వరాఘవ దర్శకుడుగా తెరకెక్కించారు. మొదటిరోజు మిక్సర్ టాక్ ని మూట కట్టుకున్న ఈ చిత్రం ఓపెనింగ్స్ విషయంలో కూడా కాస్త నిరాశ పరిచర చేసింది అయితే ఇప్పటివరకు ఈ సినిమా వీకెండ్ కలెక్షన్ల విషయానికి వస్తే..1). నైజాం-11 లక్షలు.
2). సీడెడ్ -7 లక్షలు.
3). ఉత్తరాంధ్ర -5 లక్షలు
4). ఈస్ట్ -4 లక్షలు
5) వెస్ట్ -3 లక్షలు
6). గుంటూరు-5 లక్షలు
7). కృష్ణ-6 లక్షలు
8). నెల్లూరు -3 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.44 లక్షల రూపాయలను మాత్రమే రాబట్టింది.


నేనే వస్తున్నా సినిమా తెలుగులో థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.1.85 కోట్ల రూపాయలు జరగక ఈ సినిమా సక్సెస్ కావాలి అంటే రెండు కోట్ల రూపాయలను రాబట్టాల్సి ఉన్నది. విడుదలై నాలుగు రోజులు పూర్తి అయ్యేసరికి కేవలం రూ.44 లక్షల రూపాయలు మాత్రమే రాబట్టింది బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే ఇంకా రూ.1.56 కోట్ల రూపాయలను రాబట్టాల్సి ఉన్నది. మరి ఈ సినిమా మొదటి వీకెండ్ ఏమాత్రం క్యాష్ చేసుకోలేక పోతున్నది.కాబట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే కాస్త కష్టమే అంటున్నారు సినీ ప్రేక్షకులు. అంతే కాకుండా ఇప్పుడు బడా సినిమాలు కూడా విడుదలవుతున్నాయి మరి ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎంతవరకు రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: