టాలీవుడ్ లో కామెడీ హీరోగా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు అల్లరి నరేష్. కామిక్ సినిమాలో దర్శకుడు ఇవివి సత్యనారాయణ వారసుడిగా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన అల్లరి నరేష్ తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నాడు అని చెప్పాలి. 2002లో రవిబాబు దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన అల్లరి సినిమాలో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. అయితే మొదటి సినిమానే కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అయింది. దీంతో తన పేరుకు ముందు అల్లరి అనే పేరును చేర్చుకున్నాడు.


 ఇక అల్లరి నరేష్ గా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఎంతగానో దగ్గర అయ్యాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు వరకు ఎన్నో వినోదపరితమైన సినిమాలను తీసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇటీవల కాలంలో బుల్లితెరపై ఎన్నో కామెడీ షోస్ పెరిగిపోయిన నేపథ్యంలో అటు నరేష్ సినిమాలకు పెద్దగా ఆదరణ లేకుండా పోయింది. ఒకప్పుడు వరుస విజయాలు అందుకున్న అల్లరి నరేష్ ఆ తర్వాత కాలంలో మాత్రం అదే జోరు కొనసాగించలేకపోయాడు. ఇక ఇప్పుడు అల్లరి నరేష్ తన అన్నయ్య ఆర్యన్ రాజేష్ తో కలిసి ఈవివి కింద సినిమాలను నిర్మిస్తూ ఉండడం గమనార్హం.


 ఇకపోతే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడూ. తన మొదటి క్రష్ ఏకంగా ఏడవ తరగతిలోనే చెప్పుకొచ్చాడు. ఆ వయసులోనే ఒక అమ్మాయిని ప్రేమించడం జరిగింది అంటూ చెప్పుకొచ్చాడు. మా క్లాసులో ఒక మలయాళం అమ్మాయి ముందు బెంచ్ లో కూర్చుండేది. నేను చివరి బెంచ్ లో ఉండేవాడిని. దీంతో తరచూ ఆ అమ్మాయి వైపే చూస్తూ ఉండిపోయేవాడిని.. ఆ అమ్మాయి క్లాసులో బాగా చదివేది. నాకేమో చదువు మీద ధ్యాస ఉండేది కాదు. ఇక నా ప్రేమ విషయం అమ్మాయికి చెప్తే మాట్లాడుతుందో లేదో అన్న భయంతో మనసులో మాట ఎప్పుడూ చెప్పలేదు. అందరితో కలిసిపోయి బాగా పలకరించే మనస్తత్వం ఉండడం వల్లే ఆ అమ్మాయిని ప్రేమించాను అంటూ చెప్పుకుచ్చాడు అల్లరి నరేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: