తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు ఆయన కార్తీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కార్తీ "యుగానికి ఒక్కడు" మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఈ హీరో తాను నటించిన అనేక మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి మార్కెట్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా కార్తీ "సర్దార్" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కార్తీ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో కార్తీ సరసన రాశి కన్నా హీరోయిన్ గా కనిపించబోతుంది. ఈ మూవీ కి పి ఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ,  జీ వి ప్రకాష్ కుమార్మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. 

ఇది ఇలా ఉంటే తాజాగా సర్దార్ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను అక్టోబర్ 21 వ తేదీన తెలుగు లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ లో కార్తీ తెల్లని గుబురు గడ్డం మరియు గుబురు మీసాలతో ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే సర్దార్ మూవీ పై తమిళ ,  తెలుగు ఇండస్ట్రీ లోని సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: