ఇటీవలే అవార్డుల ఫంక్షన్ లు ఎక్కువగానే జరుగుతున్నాయి అని చెప్పొచ్చు. సైమా అవార్డుల ఫంక్షన్ జరిగిన కొద్ది రోజులకే ఫిలిం ఫేర్ అవార్డులు కూడా జరగడం విశేషం. ఈ నేపథ్యంలో హీరోయిన్ కేటగిరీలో రెండు అవార్డులను అందుకున్న సాయి పల్లవి గురించి ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఆమె హీరోయిన్ గా నటించిన శ్యామ్ సింగ రాయ్ చిత్రానికి అలాగే లవ్ స్టోరీ సినిమాకి ఈ అవార్డులు దక్కగా పుష్ప సినిమాలో హీరోయిన్ గా చేసిన రష్మిక మందనకు ఈ అవార్డు దక్కకపోవడం నిజంగా ఆమె అభిమానులను కొంత ఆగ్రహ పరుస్తుంది. 

చెప్పాలంటే సాయి పల్లవి అందుకున్న రెండు సినిమాల కంటే కూడా పుష్ప సినిమా ఎంతో ఘన విజయం సాధించింది. నటన పరంగా కూడా రష్మిక మందన చాలా బాగా చేసింది. ఈ నేపథ్యంలో రష్మిక మందనకు ఒక అవార్డు కూడా ఇవ్వకపోవడం ఆమె అభిమానులను తీవ్రంగా కలవర పెట్టిస్తుంది. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం రష్మిక మందన వచ్చి అవార్డు అందుకోవాల్సిందిగా ఫిలింఫేర్ బృందం అడిగిందట కానీ ఆ సమయంలో ఆమె అందుబాటులో లేకపోవడంతో ఆ అవార్డు ఫంక్షన్కు ఆమెకు రాలేకపోయిందట.

 దాంతో ఎవరికో ఎవరికీ అవార్డు ఇవ్వాలి కాబట్టి వారు ఈ అవార్డును సాయి పల్లవి ఇవ్వడం జరిగింది అయితే వేరే సినిమాలు చాలా విడుదలైన నేపథ్యంలో ఓకే సినిమాని రెండో అవార్డులు ఇవ్వడం కొంతమందికి నచ్చడం లేదు. ఇంకొక వైపు సాయి పల్లవి అభిమానులు ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమ కి దొరికిన మంచి నటి సాయి పల్లవి అని ఆమెను పొగుడుతున్నారు. ఇక ఆమె చేస్తున్న సినిమాల విషయానికొస్తే ఎందుకో ఆమె చేతిలో ఇప్పుడు ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. తొందరలోనే ఆమె కొన్ని మంచి ప్రాజెక్ట్ లలో నటిస్తుంది అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: