ఈ విషయం పైన హీరో రామ్ పోతినేని అభిమానులు నిరుత్సాహంతో ఉన్నట్లు సమాచారం. ఇది ఒక బ్యాడ్ సెంటిమెంట్ అంటూ హీరో రామ్ అభిమానులు కొందరు ప్రశ్నిస్తున్నారు. బోయపాటి శ్రీను ఈ సినిమా కథ రామ్ తండ్రి పాత్రలో సునీల్ శెట్టి అయితే బాగుంటుందని అభిప్రాయంతో ఉన్నాడని అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ఫస్ట్ లుక్ వెలుపడే అవకాశం ఉందని సమాచారం.
హీరో రామ్ చివరిగా ఈ వారియర్ చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన పరాజయాన్ని చూశారు. అందుచేతనే ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి అంచనాలు తగ్గట్టుగా డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాని తీసుకువస్తాడని చాలా నమ్మకంతో ఉన్నారు తెలుగులో సునీల్ శెట్టి ఈ సినిమాతో మొదటిసారి కమర్షియల్ సక్సెస్ అందుకుంటారేమో చూడాలి మరి. ఇక ఇందులో హీరోయిన్ గా కూడా శ్రీ లీల నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ ముద్దుగుమ్మ నటించిన మొదటి చిత్రం పెళ్లి సందD తోనే మంచి విజయాన్ని అందుకుంది. మరి హీరో రామ్ కైనా ఈ సినిమాతో బోయపాటి శ్రీను సక్సెస్ ను అందిస్తారేమో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి