
ఇమ్మంది రామారావు మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో సహజ. నటిగా మాత్రమే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా కూడా నిర్మలమ్మ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఎవరు కూడా ఆకలితో ఉండకూడదని ఎంతోమంది కడుపు నింపిన అన్నపూర్ణ ఆమె. అలాంటిది చివరి రోజుల్లో మాత్రం దుర్భరమైన జీవితాన్ని ఎదుర్కొంది అంటూ ఆయన తెలిపారు. అంతేకాదు నిర్మలమ్మ పెంచి పెద్ద చేసిన పిల్లలే చివరి రోజుల్లో ఆమెను పట్టించుకోలేదు.. డయాబెటిస్ సమస్యతో బాధపడుతూ ఆ విషయాన్ని గుర్తించక ఎంతో ఇబ్బంది పడుతూ తన చివరి రోజులు గడిపారు అని ఈ సందర్భంగా జర్నలిస్ట్ వెల్లడించారు.

తాను దత్తత తీసుకొని పెంచి పెద్ద చేసిన పిల్లలు చివరి రోజుల్లో తన పట్ల నిర్లక్ష్యం వహించారు అని , ఇలా పిల్లల నిర్లక్ష్యానికి తోడు డయాబెటిస్ కూడా రావడంతో ఆమె కాలం చేశారు అని ఆయన వెల్లడించారు. ఎంతో మహోన్నతంగా జీవించిన నిర్మలమ్మ ఇలా చివరి రోజుల్లో నా అనుకున్న వాళ్లు ఎవరూ లేక విగత జీవిగా మరణించడం ఇండస్ట్రీకే బాధాకరమని చెప్పాలి . ఇలాంటి గొప్ప వ్యక్తులు మళ్లీ ఇండస్ట్రీలో తారసపడతారో లేదో. ఏది ఏమైనా నటి నిర్మలమ్మ సినీ ఇండస్ట్రీని వదిలి వెళ్లడం బాధాకరమనే చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి