మహేష్ బాబు హీరోగా
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ
సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ నిర్ణయించలేదు. ఆరంభం అనే టైటిల్ ను పెట్టడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో మహేష్ బాబు ఈ
సినిమా యాక్షన్ సీన్స్ బాగోలేని నేపథ్యంలో మొదటి షెడ్యూల్ ను పూర్తిగా క్యాన్సల్ చేశాడు. అందుకే ఇప్పుడు దానిని మళ్లీ చేయడానికి
త్రివిక్రమ్ ప్లాన్ చేశాడు. అయితే మహేష్ బాబు హాలిడే ట్రిప్ వెళ్లడంతో అది పూర్తయిన తర్వాతనే ఈ సినిమాను మళ్ళీ మొదలు పెట్టనున్నారు.
ఈ నెల ద్వితీయార్థంలో ఈ సినిమాకు సంబంధించిన తదుపరి షెడ్యూల్ మొదలు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ
సినిమా తర్వాత
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు
సినిమా చేయనున్న నేపథ్యంలో వచ్చే ఏడాది
సంక్రాంతి కల్లా ఈ సినిమాను పూర్తి చేయాలి అనేది వారి టార్గెట్. అయితే షూటింగ్ ఆలస్యం అవుతూ ఉండటంతో మహేష్ బాబు తన తదుపరి
సినిమా ఆలస్యం అవుతుందని అందరూ భావిస్తున్నారు. అదే సమయంలో
త్రివిక్రమ్ సినిమా విడుదల కూడా ఆలస్యం అవుతుందని చెబుతున్నారు.
వాస్తవానికి ఈ సినిమాను మొదలుపెట్టినప్పుడే ఏప్రిల్ 28వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశామని అధికారికంగా ప్రకటించారు కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం విడుదల అవడం చాలా కష్టం అని తెలుస్తుంది. ఇదే విషయం సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యూరేట్ అవ్వడంతో తాజాగా చిత్ర బృందం తమ సన్నిహితుల వద్ద ఈ విషయాన్ని వెల్లడించిందట. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు తప్పకుండా ఈ సినిమాను ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేస్తామని వారు చెబుతున్నారట. మరి ఈ
సినిమా అనుకున్న తేదీకి విడుదల అవుతుందా అనేది చూడాలి.
త్రివిక్రమ్ సినిమాలు ఫాస్ట్ గా నే చేస్తాడన్నా విషయం తెలిసిందే.