పూరీజగన్నాథ్ కు నడుస్తున్న కాలం ఏమాత్రం కలిసివస్తున్నట్లు కనిపించడంలేదు. ‘లైగర్’ మూవీ సూపర్ ఫ్లాప్ గా మారినప్పటికీ ఆమూవీకి సంబంధించిన సమస్యలు పూరీకి రోజురోజు పెరిగిపోతూనే ఉన్నాయి. ‘లైగర్’ మూవీ పెట్టుబడికి ఒక ప్రముఖ రాజకీయ వేత్త విదేశాల నుండి భారీ మొత్తాలు పంపించారు అన్న విషయమై జరుగుతున్న విచారణకు ఈడీ ముందుకు పూరీ ఛార్మీ లు రావడమే కాకుండా వారిని ఏకంగా 10 గంటలు విచారణ చేయడంతో ఇండస్ట్రీలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.


‘లైగర్’ చిత్రానికి ఎవరెవరు పెట్టుబడులు పెట్టారు దానికి సంబంధించిన నిర్మాణ ఖర్చులు వచ్చిన ఆదాయం ఆ ఆదాయం పంపకం ఎలా జరిగింది అంటూ ఈడీ అధికారులు పూరీ ఛార్మీ లను గుచ్చిగుచ్చి ప్రశ్నలు అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ‘లైగర్’ విడుదల కాకుండానే ‘జన గణ మన’ మూవీ ప్రారంభించడానికి పెట్టుబడి పెట్టింది ఎవరు ఆవ్యక్తి వివరాలను కూడ ఈడీ సేకరించినట్లు తెలుస్తోంది. ‘లైగర్’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో ‘జన గణ మన’ ఆగిపోయినప్పటికీ ఆమూవీ కోసం భారీ స్థాయిలో పూరీ నటీనటులకు సాంకేతిక నిపుణులకు అడ్వాన్స్ లు ఇచ్చినట్లు తెలియడంతో ఆ డబ్బు ఎక్కడిది అన్న కోణంలో కూడ విచారణ జరుగుతున్నట్లు టాక్.


ఈ ఆరోపణలకు సంబంధించి పూరీ ఛార్మీ లు కొన్ని అవసరమైన పత్రాలను వారి వెంట తీసుకు వెళ్ళి వాటిని ఈడీ అధికారులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 10 గంటల విచారణ తరువాత మరొకసారి విచారణకు రావలసి ఉంటుందని ఈడీ అధికారులకు పూరీ ఛార్మీ లకు చెప్పినట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో గుప్పుమనడంతో పూరీ అనవసరంగా ‘లైగర్’ సినిమాను తీసి పొరపాటు చేసాడా అంటూ కొందరు అతడి సన్నిహితులు కామెంట్స్ చేస్తున్నట్లు టాక్. ఎందరో టాప్ హీరోలకు బ్లాక్ బష్టర్ హిట్స్ ఇచ్చిన పూరీ తన కెరియర్ లో ఎదుర్కుంటున్న ఈ కష్టాల నుండి త్వరగా బయటపడాలని అతడి అభిమానులు సన్నిహితులు ఆశిస్తున్నారు..  మరింత సమాచారం తెలుసుకోండి: