రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్.ఆర్.ఆర్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా విడుదల అయ్యి ఎనిమిది నెలలు అవుతున్నా ఇప్పటికీ కూడా ఎక్కడ క్రేజ్ తగ్గకుండా అంతే స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా విదేశాలలో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టి.. ఇందులో నటించిన నటీనటులకు కూడా మరింత మంది అభిమానులుగా మారిపోయారు. రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసి మంచి గుర్తింపు సొంతం చేసుకున్న తర్వాత జపాన్ లో కూడా విడుదల చేశారు.

గత నెల రోజుల క్రితం టీం యూనిట్ మొత్తం జపాన్ కి వెళ్లి మరి అక్కడ ప్రమోషన్స్ చేపట్టిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి జపాన్ లో తెలుగు,  తమిళ సినిమాలకు మంచి ఆదరణ ఉంది.  ఈ క్రమంలోనే రజినీకాంత్,  మీనా కాంబినేషన్లో వచ్చిన ముత్తు సినిమా జపాన్లో విడుదలై అక్కడ స్టార్ హీరో,  హీరోయిన్ హోదాను కైవసం చేసుకున్నారు రజినీకాంత్, మీనా.. అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా అక్కడ విడుదల చేయగా ముత్తు రేంజ్ను అందుకోలేకపోయింది. ముత్తు సినిమా 1995 లో  విడుదల అయ్యి.. దాదాపు కొన్ని సంవత్సరాలు అవుతున్నా ఆ సినిమా క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదని స్పష్టమైంది.

ముత్తు సినిమా మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా ఆర్ఆర్ఆర్ రెండవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీన్ని బట్టి చూస్తే రజినీకాంత్ నటించిన ముత్తు సినిమా జపాన్ ప్రేక్షకులను ఎంతగా మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. ఆర్.ఆర్.ఆర్ సినిమా ఒక్క జపాన్ లో మినహా అన్ని ప్రాంతాలలో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది . ఏది ఏమైనా జపాన్లో రెండవ స్థానంతో సరిపెట్టుకోవడంతో చిత్ర బృందం కొంత నిరాశ వ్యక్తం చేసిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: