ఈటివిలో ఎప్పటినుంచో ప్రసరమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ షో ను చూడని వారంటూ  ఉండరు.ఈ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న అనేకమంది ఇప్పుడు మంచి మంచి అవకాశాలతో దూసుకుపోవడం మనం చూస్తున్నాం..అయితే ఇప్పటి వరకు వీటి రేటింగ్స్ ను కొట్టే షో లు రాలేదంటే వీటిని స్టామినా అర్దం చేసుకోవచ్చు.అంతేకాదు ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇటు టీవీ కి మరియు సినిమాకు పరిచయమయ్యారు. ఈ షో లను నడుపుతున్న మల్లె మాల టీమ్ వారు ప్రతి ఆదివారం

 వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ’ షో ను కూడా మంచి హ్యూమరస్ గా ఉంచడానికి ట్రై చేస్తున్నారు.అంతేకాదు ఈ షో ను కూడా హైపర్ ఆది మరియు ఆటో రామ్ ప్రసాద్ లు తమదైన టైమింగ్ తో లాక్కొస్తున్నారు.ఇకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలో భాగంగా వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌లో హైపర్ ఆదితో యాంకర్ రష్మీగేమ్ ఆడించింది.అయితే  దీని ప్రకారం.. స్క్రీన్‌పై కనిపించే ఓ నెంబర్‌ను అతడు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దాని వెనుక ఏమి రాసి ఉంటే అతడు ఆ టాస్కును చేయాల్సి ఉంటుంది.ఇదిలావుంటే ఇక టాస్కులో భాగంగా హైపర్ ఆది

 తన లక్కీ నెంబర్ 9 అని దాన్నే కోరుకున్నాడు. ఇక దీంతో అతడికి ‘ఒకరికి 30 సెకెన్లు ముద్దు పెట్టాలి’ అని టాస్క్ వచ్చింది. అయితే దీంతో ఐశ్వర్య అతన్ని చూసి పారిపోయింది. ఇక పోతే ఇవన్ని నీ వేషాలే అని అనడంతో ఈసారి హైపర్ ఆది 11ను సెలెక్ట్ చేసుకున్నాడు.అయితే  దీని వెనుక ‘గుండు కొట్టించుకోవాలి’ అని వచ్చింది. ఇక దీంతో ఆది పారిపోతున్నా గాని పట్టుకొని , ఇంద్రజ గారు వారిస్తున్నా వినకుండా గుండు చేయించినట్లు చూపించారు. అయితే,ఇక  చివర్లో మాత్రం ఆది ఫేస్ రీవిల్ చేయలేదు. ఇక నిజంగానే ఆది కి గుండు కొట్టారా లేదా అనేది వచ్చే ఎపిసోడ్ లో తెలుస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: