తమిళ్,తెలుగు స్టార్ హీరో విజయ్ సినిమా వస్తుందంటే ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు..ఆయన సినిమాలు అంత హిట్ టాక్ ను అందుకున్నాయి. ఇప్పటికే ఎన్నో సినిమాలు తెలుగులో కూడా విడుదల అయ్యి మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి.అన్నీ సినిమాలు కూడా తమిళ్ నుంచి తెలుగు వచ్చిన సినిమాలు కాకుండా ఇప్పుడు తెలుగు లో వస్తున్న సినిమా వారసుడు..ఈ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరపుకుంటున్న ఈ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్నా నటిస్తుంది. ఇప్పటికే మ్యూజిక్ డైరె క్టర్ థమన్ కంపోజ్ చేసిన రంజితమే సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేసింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి మరో స్పెషల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.వరిసు నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. #TheeThalapathy అనే సాంగ్ డిసెంబర్ 4న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.


అగ్ని మధ్య చెస్ గేమ్ కింగ్ ప్రతిబింబించేలా ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరలవుతుంది. ఇక గతంలో ఈ నుంచి విడుదలైన వర్కింగ్ స్టిల్స్ పై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఓకేసారి పది స్టిల్స్ విడుదల చేసి దళపతి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్. అందులో విజయ్ కొత్త లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. విజయ్ తో పాటు రష్మిక, ఖుష్బూ కూడా ఇందులో నటిస్తున్నారు.వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: