హిట్ , ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస మూవీ లతో దూసుకుపోతున్న యంగ్ హీరోలలో ఒకరు అయినటు వంటి ఆది సాయి కుమార్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆది సాయి కుమార్ ఇప్పటికే ఈ సంవత్సరం అనేక మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఆది సాయి కుమార్ "క్రేజీ ఫెలో" అనే మూవీ లో కూడా హీరో గా నటించాడు. ఫణి కృష్ణ సిరికి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేక పోయింది. 

దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టు కోలేక పోయిన క్రేజీ ఫెలో సినిమా మరి కొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటు వంటి ఆహా "ఓ టి టి" సంస్థ దక్కించుకుంది. ఈ మూవీ ని రేపు అనగా డిసెంబర్ 3 వ తేదీ నుండి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ఆహా "ఓ టి టి" సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. మరి థియేటర్ లలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తోందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: