ప్రముఖ యంగ్ హీరో అడవి శేష్ మేజర్ సినిమా తర్వాత భారీ విజయాన్ని అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని నిర్మాణ సారధ్యంలో హిట్ సినిమా సీక్వెల్ గా నిన్న దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 995 స్క్రీన్ లలో భారీగా విడుదలైన హిట్ 2 సినిమా మొదటి షో తోనే మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు మొదటి షో తోనే 3.5 రేటింగ్ సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అసలు విషయంలో కి వెళ్తే.. నిన్న డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే అత్యధిక కలెక్షన్లు సృష్టించి రికార్డు సాధిస్తుందని నిర్మాతలు సైతం ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు.  ఎలాగో ఈరోజు రేపు వీకెండ్స్ కావడంతో సెలవు దినాలలో సినిమాను ఎక్కువ మంది వీక్షించే అవకాశం ఉంది.  ఎక్కువ థియేటర్లలో సినిమా ఆడుతున్న నేపథ్యంలో కలెక్షన్స్ కూడా ఎక్కువ స్థాయిలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కేవలం యూఎస్ఏ లోనే 450 స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమా వీకెండ్ లోగా ఏకంగా $400 మార్క్ ను చేరబోతోంది అని సమాచారం.

ఈరోజు రేపట్లో వీకెండ్ లోగా ఈ మార్క్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.  మొత్తానికి అయితే హిట్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న డైరెక్టర్  హిట్ 2 సినిమాతో కూడా భారీ పాపులారిటీని తన ఖాతాలో వేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.  ఈ సినిమా తర్వాత హిట్ 3 తో పాటు ఫోర్ , ఫైవ్ , సిక్స్,  సెవెన్ సీక్వెల్స్ కూడా ఉండనున్నట్లు హీరో నాని స్పష్టం చేసిన విషయం తెలిసిందే . మరి మొదటి,  రెండు భాగాలతో భారీ విజయాన్ని అందుకున్న శైలేష్  మిగతా సీక్వెల్స్ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు.. ముఖ్యంగా ఎలాంటి కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.. తారాగణం ఎవరు? హీరోయిన్ ఎవర?  ఇలా రకరకాలుగా వార్తలు వైరలవుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: