టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోగా వరుస సక్సెస్ లను అందుకుంటూ పోతున్నాడు నాని. అద్భుతమైన కథనం ఉన్న సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.వరుస  సినిమాల విజయాలతో హిట్ 3  సినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగాయి .హిట్ 3  లో నాని నటిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ సినిమా మరింత ఎక్కువ మొత్తం బడ్జెట్ తెరకెక్కుతుందని తెలుస్తోంది. హిట్ 3  మూవీ బడ్జెట్ విషయంలో తగ్గేదెలా అంటున్నాడట నాని. హిట్ 3 సినిమాలో విశ్వక్సేన్ అడవి శేషు కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది .

భారీ మల్టీస్టారర్ గా ఈ సినిమా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారం గురించి నాని ఏమంటారో చూడాల్సి ఉంది. హిట్ సినిమాలో అర్జున్ సర్కార్ పాత్రలో నాని కనిపించనున్నాడు. విశ్వక్సేన్ అడవి శేషు తో కలిసి దిగిన ఫోటోను ఇటీవల నాని షేర్ చేయడంతో ఈ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇక నాని నటిస్తున్న దసరా సినిమాతో మార్కెట్ ను భారీగా పెంచుకోవడం  గ్యారెంటీ అని అంటున్నారు ఈయన అభిమానులు. దాంతో దసరా మూవీ తర్వాత హిట్ 2 సినిమా విడుదల అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు క్రియేట్ చేస్తుంది

అనడంలో ఎలాంటి సందేహం లేదు అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. హిట్ 3 సినిమాలో వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. ఇక దర్శకుడు శైలేష్ కొలను ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో నాని కొత్త లుక్ లో కనిపించనున్నాడట విభిన్నమైన కథలకు ఓటేస్తున్న నాని మెజారిటీ ఈ  సందర్భాల్లో సక్సెస్ ను  సొంతం చేసుకుంటూ పోతున్నాడు.ఈయన అభిమానించే ఆయన ఫ్యాన్స్ సంఖ్య కూడా ఇప్పుడు పెరిగిపోతుంది. దీంతో హిట్ త్రీ కోసం నాని అభిమానులు చూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: