పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా విరూపాక్ష అనే సినిమా రూపొందబోతుంది అంటూ ఆ మధ్య సోషల్ మీడియా లో  తెగ ప్రచారం జరిగింది మరీ. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కు విరూపాక్ష టైటిల్ ఖరారు అయినట్లే అంటూ ప్రముఖ మీడియా సంస్థలు కూడా తెగ కథనాలు  కూడా రాశాయి.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విరూపాక్ష టైటిల్ ని మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ దక్కించుకున్నాడు. గతం లో విరూపాక్ష టైటిల్ పవన్ కళ్యాణ్ కోసం పరిశీలించినప్పటికీ ఆ తర్వాత దాన్ని ఎవరు కూడా దక్కించుకోలేదు అని చెప్పొచ్చు

ప్రముఖ నిర్మాత వద్ద ఆ టైటిల్ ఉండడం తో ఒకరు ఇద్దరు ప్రయత్నించినా కూడా కానీ ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ హీరో గా బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా కు గాను విరూపాక్ష టైటిల్ ని ఖరారు చేయడం జరిగిందట మరీ,పవన్ కళ్యాణ్ కి కచ్చితంగా సూపర్ సెట్ అవుతుందని భావించిన విరూపాక్ష టైటిల్ సాయి ధరమ్ తేజ్ కి ఏపాటి సెట్ అవుతుందో మనకి అర్థం కావడం లేదు అంటూ మెగా ఫాన్స్  ఇలా మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియా లో అప్పుడే ఈ సినిమా టైటిల్ గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతకు ముందే ఈ సినిమా ను అత్యంత విభిన్నం గా తెరకెక్కిస్తూ అందరి అభిమానం ను తన సొంతం చేసుకునే విధంగా దర్శకుడు చేయబోతున్నాడు అంటూ సాయి ధరమ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి. కొత్త దర్శకుడితో చేయాల్సిన అవసరం ఏంటి అంటూ ఒక అభిమాని ప్రశ్నించిన సందర్భంగా అతడి పేరు ముందు ముందు ఎంతో పాపులారిటీ అవుతుంది అన్నట్లుగా తేజ్ సమాధానం ఇలా ఇచ్చాడు. మరి ఈ విరూపాక్ష ఎంత వరకు సక్సెస్ అవుతాడు అనేది  మనం వేచి చూడాలి మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి: