పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ సంవత్సరం భీమ్లా నాయక్ మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో దగ్గుబాటి రానా కూడా హీరోగా నటించాడు. ఈ మూవీ తో పవన్ కళ్యాణ్ మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఎం ఎం కీరవాణిమూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికే అనేక మూవీ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. చాలా రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం లో భావదీయుడు భగత్ సింగ్ అనే మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అలాగే చాలా రోజుల క్రితమే సురేందర్ రెడ్డి దర్శకత్వం లో కూడా ఒక మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఒక మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన అధికారికంగా ప్రకటన కూడా వెలబడింది. ఇలా పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒక సినిమాలో నటిస్తూ మూడు మూవీ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: