ఈమధ్య కాలంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలామంది స్టార్ హీరోలు ఒకరి తర్వాత ఒకరు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకుని తమ మార్కెట్ ను పెంచుకోవడానికి యంగ్ హీరోలు కూడా పోటీ పడుతున్నారు.. ఈ క్రమంలోని విభిన్నమైన కథలను ఎంచుకొని పాన్ ఇండియా రేంజ్ లో తమ సినిమాలను విడుదల చేస్తూ భారీ రేంజ్ లో అభిమానులకు దగ్గరవుతున్నారు.. ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక యంగ్ హీరో కూడా పాన్ ఇండియా హీరోల జాబితాలోకి చేరబోతున్నాడు.


ఆయన ఎవరో కాదు ఇటీవల మేజర్ , హిట్ 2 వంటి చిత్రాల ద్వారా భారీ స్థాయిలో పాపులారిటీని దక్కించుకున్న యంగ్ హీరో అడివి శేష్.. తాజాగా ఈ రెండు సినిమాలు దాదాపు రెండు మిలియన్ డాలర్ల జాబితాలోకి చేరిపోయాయి. దీన్నిబట్టి చూస్తుంటే ఈయన కూడా పాన్ ఇండియా హీరో లెవెల్ కి చేరబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ రెండు సినిమాలు అడివి శేష్ కి ఎంత పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో మేజర్ ఉన్నికృష్ణన్ వీరోచితంగా పోరాడిన ఆయన కథను ఆదర్శంగా తీసుకొని మేజర్ సినిమాను తెరకెక్కించారు.  ఈ సినిమా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరిని కలచివేసింది.


ఇక భారీ స్థాయిలో వసూళ్లు క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇప్పుడు ఇదే తరహాలో డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో నాని నిర్మాతగా వచ్చిన హిట్ 2 సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్గా సాగిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది . అంతేకాదు సెన్సార్ బోర్డు కూడా ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.  దీంతో కలెక్షన్లు మోత మోగిస్తోంది. ఇక ఈ రెండు సినిమాలే అడివి శేష్ ను పాన్ ఇండియా హీరోగా నిలబెట్టాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: