అనూహ్యంగా ఈమూవీ బాలీవుడ్ ప్రేక్షకులకు కూడ విపరీతంగా నచ్చడంతో ఈమూవీ పార్ట్ 2 తీసే విషయంలో సుకుమార్ చాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అని టాక్. గంధపు చెక్కలు కొట్టే ఒక కూలి స్మగ్లర్ గా ఎదగడం పార్ట్ 1లో చూపెడితే పార్ట్ 2లో ఆస్మగ్లర్ అంతర్జాతీయ డాన్ గా ఎదిగి మళ్ళీ ఎలా కష్టాలలో పడ్డాడు అన్న ట్విస్ట్ లు అనేకం పార్ట్ 2లో ఉంటాయని లీకులు వస్తున్నాయి.
సుకుమార్ ఆలోచనలలో ఈమూవీకి పార్ట్ 3 తీయాలి అని కోరిక ఉన్నట్లు తెలుస్తోంది. ఈవిషయాన్ని సుకుమార్ తన సన్నిహితులతో కూడ చేపుతున్నాడట. అయితే ఈ పార్ట్ 3 వెంటనే తీయకుండా తాను ఒప్పుకున్న మరో రెండు సినిమాలు పూర్తి చేసి అప్పుడు పార్ట్ 3 పై దృష్టి పెడతాడట. ఈలోపున మరో రెండు సినిమాలు పూర్తి చేసుకుని వస్తాడు కాబట్టి టైమ్ గ్యాప్ దొరుకుతుందని సుకుమార్ ఆలోచన అని అంటున్నారు.
వాస్తవానికి ‘పుష్ప’ పార్ట్ 1 విడుదల అయిన తరువాత పార్ట్ 2 కు సుకుమార్ రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకోవాలని అనుకున్నాడట. అయితే ‘పుష్ప’ ఏర్పడిన మ్యానియాతో వెంటనే పార్ట్ 2ను మొదలు పెట్టవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు పార్ట్ 2 కూడ భారీ సక్సస్ ను అందుకుంటే సుకుమార్ మళ్ళీ తన ఆలోచనలు మార్చుకుని పార్ట్ 3 వెనువెంటనే మొదలు పెట్టినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. ఎంతో క్రేజ్ ఉంది కాబట్టే సుకుమార్ 75 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు అంటూ గాసిప్పులు వస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి