టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ 1 స్టార్ హీరోగా స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్. మహేష్ సినిమాల కోసం ఆయన ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.. ఇక గత ఏడాది మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా తక్కువ రేటింగ్స్ ఇంకా భయంకరమైన నెగటివ్ రివ్యూస్ తోనే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి ఫైనల్ గా ఆ సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.ఇప్పుడు మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.. ఇప్పటికే వీరి కాంబోలో అతడు ఇంకా ఖలేజా వంటి సినిమాలు వచ్చాయి..బాక్స్ ఆఫీస్ రిజల్ట్ పక్కనపెడితే ఈ సినిమాలకి ఇప్పటికీ సెపరేట్ క్రేజ్ ఉంటుంది.ఇక ఇప్పుడు ముచ్చటగా మూడవసారి ఈ కాంబో సెట్ అవ్వడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.


ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో సారధి స్టూడియోస్ లో  జరుగుతుంది..ఈ సినిమాను ఆగస్టు 11 వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.. ఈ సినిమా షూట్ సగం కూడా పూర్తి కాకుండానే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.. దీంతో ఈ సినిమా బిజినెస్ కూడా ముందుగానే రికార్డు స్థాయిలో జరిగిపోతున్నట్టు తెలుస్తుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ నైజాం ఏరియాకు సంబంధించి అప్డేట్ కూడా వచ్చింది. నైజాం ఏరియాకి ప్రముఖ నిర్మాత, డిస్టిబ్యూటర్ అయిన దిల్ రాజు చాలా భారీ మొత్తం ఇచ్చి థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకున్నట్టు సమాచారం తెలుస్తుంది. ఒక్క నైజాం ఏరియానే ఏకంగా 50 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయినట్టు సమాచారం తెలుస్తుంది.. ఇలాంటి రికార్డులు కేవలం మహేష్ కే సొంతం. అందుకే మహేష్ ని రికార్డుల రారాజు అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: