ఈ మధ్యకాలంలో స్టార్ స్టేటస్ ఉన్న వారి సినిమాలకే ప్రేక్షకులు థియేటర్లకు రావడం కష్టంగా మారిందని చెప్పవచ్చు. మరి కొత్త వారైతే ఇంకా థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా అంటే చెప్పలేమని చెప్పవచ్చు.. టాక్ బాగుంటే ప్రేక్షకులు వస్తారని కన్నడ సినిమా అయినా కంతారా సినిమా అందుకు ఉదాహరణంగా అని చెప్పవచ్చు. అయితే త్రిష నటించిన సినిమా తెలుగు తమిళ్ భాషలో విడుదల చేయాలనుకున్నారు. ఇక రెండు భాషలలో కూడా త్రిష కు క్రేజ్ బాగానే ఉందని చెప్పవచ్చు. త్రిష నటించిన తాజా మూవీస్ రాంగి, జర్నీ ఫేమ్  ఎం శరవరన్ ఈ సినిమాని దర్శకత్వం వహించారు.

ఈ చిత్రంతో తనతో కలిసి పాపులర్ డైరెక్టర్ ఏ ఆర్ మృగదాస్ కథ అందించారు.ప్రముఖ లైక ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. డిసెంబర్-30 న విడుదలైన ఈ సినిమా తెలుగులో రిపోర్టర్ పేరుతో సంక్రాంతి సమయంలో విడుదల చేయాలని చిత్ర బృందం భావించారు. కానీ అక్కడే వారి డిజాస్టర్ అనిపించుకోవడంతో ఈ సినిమాని తెలుగు లో విడుదల చేయలేకపోయారు. ఈ చిత్రంలో త్రిష లైవ్ పోర్టల్ రిపోర్టర్ గా కనిపించింది.

ఇక ఒక టెర్రరిస్ట్ ఫేస్బుక్ ఫేక్ అకౌంట్ ని కనిపెట్టే పనిలో ఉంటుంది త్రిష అతనితో అసలు విషయాన్ని రాబట్టే క్రమంలో క్రిస్టియానో అరెస్టు చేయడం జరుగుతుంది.ఆ తర్వాత ఏం జరుగుతుందని విషయాన్ని తాను ఎలా బయటపడుతుంది అనే విషయం కథ ఆధారంగా తెరకెక్కించారు. దీంతో ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. దీంతో ఇంత భారీ బడ్జెట్ పెట్టిన ఈ సినిమాకి ఇలాంటి సిల్లీ కథ అందించడంతో ప్రేక్షకులు వీరందరి అతి తెలివితో ప్రేక్షకులను టార్చర్ పెట్టారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.. ఇదంతా ఇలా ఉంటే తెలుగులో రిలీజ్ చేయాలనుకున్న మేకర్స్ తమిళంలో డిజాస్టర్ గా ఈ మూవీ తెచ్చుకోవడంతో నేరుగా ఓటీటిలో విడుదల చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: