కళాతపస్వి కే విశ్వనాథ్ ఇటీవలే చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. ఇక ఆయన మరణంతో ఇండస్ట్రీ పెద్దదిక్కును కోల్పోయింది అని చెప్పాలి. దర్శకుడిగా నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎనలేని సేవలు అందించిన కే విశ్వనాథ్ తెలుగు చిత్రాలకు కొత్త ఊపిరి పోసారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా శాస్త్రీయ సంగీతానికి వెండితెరపై  పట్టాభిషేకం చేశారు ఆయన. అయితే కే విశ్వనాథ్ లేరు అన్న వార్తను అటు తెలుగు ఇండస్ట్రీ ఇంకా జీర్ణించుకోలేక పోతుంది అని చెప్పాలి. ఇప్పటికి ఆయన చేసిన సేవలను ఎంతోమంది సినీ ప్రముఖులు గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందుతూనే ఉన్నారు.


 ఎన్నో అద్భుతమైన సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన మూత్ర వేసుకున్నారు కే విశ్వనాథ్. అయితే ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో స్టార్లుగా కొనసాగిన వారి ఫ్యామిలీ నుంచి ఎంతోమంది ఇక వారి వారసులుగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. అయితే కే విశ్వనాథ్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టలేదు అని చెప్పాలి. ఇందుకు కారణం ఏంటి అన్న విషయాన్ని కే విశ్వనాథ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఇండస్ట్రీకి రావడానికి నేనే ప్రోత్సహించలేదు.


 వాళ్ళు ఇక్కడ రాణిస్తారని నమ్మకం నాకు కలగలేదు. ఈ రోజుల్లో పైకి రావడం అంటే చాలా కష్టమైన విషయం. మా రోజుల్లో పరిస్థితి వేరుగా ఉండేది. అప్పుడు ప్రతిభను గుర్తించే మనుషులు ఎక్కువగా కనిపించేవారు. ఇక డబ్బులు విషయంలో.. పేరు ప్రఖ్యాతలు విషయంలో ఇక్కడ ఆనిస్థితి ఉంది. అందుకే మా పిల్లల్ని ఇండస్ట్రీలోకి రాకుండా బాగా చదివించి వేరే రంగాల్లో స్థిరపడేలా చేశానంటూ చెప్పుకొచ్చారు కె విశ్వనాథ్. అంతేకాకుండా వాళ్లు ఒకవేళ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నా గౌరవ మర్యాదలను నా బిడ్డలకు ట్రాన్స్ఫర్ చేయాలనే రూల్ కూడా లేదు. ఇండస్ట్రీలో ఎవరికి వాళ్లే సొంతంగా నిరూపించుకోవాలి అంటూ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: