రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఆయన స్టార్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మిర్చి మూవీ వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగిన ప్రభాస్ ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సిరీస్ మూవీ ల ద్వారా ఇండియా రేంజ్ లో అదిరిపోయే రేంజ్ స్టార్ డమ్ ను సంపాదించుకున్నాడు. దానితో ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా మూవీ లలో ... పాన్ వరల్డ్ మూవీ లలో హీరో గా నటిస్తూ అద్భుతమైన జోష్లో  తన కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ వరుస మూవీ లలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం ఈ స్టార్ హీరో కే జీ ఎఫ్ సిరీస్ మూవీ లతో ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో జగపతి బాబు , పృధ్వీరాజ్ సుకుమరన్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ మూవీ కి రవి బుస్రుర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది.

మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాక ముందే ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ బిజినెస్ ఆఫర్ లు వస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ యొక్క ఆంధ్ర ధియేట్రికల్ రైట్స్ కు దాదాపు 100 కోట్ల వరకు ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్ర ఏరియాలోని ఈ రేంజ్ బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే ఈ మూవీ పై ప్రేక్షకులు ఏ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారో మనకు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: