మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లు మొట్ట మొదటి సారి "ఆర్ ఆర్ ఆర్" మూవీ లో కలిసి నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అజయ్ దేవగన్ ... శ్రేయ ... సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య ఈ సినిమాను డి వి వి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎంతో భారీ ఖర్చుతో నిర్మించాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం మార్చి 25 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇప్పటికి కూడా ఈ సినిమా జపాన్ లో విజయవంతంగా థియేటర్ లలో రన్ అవుతుంది. అలాగే జపాన్ లో ఈ మూవీ కి భారీ కలెక్షన్ ఇప్పటికి కూడా దక్కుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ లోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ కూడా దక్కింది.

 ఈ పాటతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ స్థాయిలో పెరిగింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఇప్పటి వరకు 5 సార్లు బుల్లి తెరపై ప్రసారం అయింది. 5 సార్లు ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ "టి ఆర్ పి" రేటింగ్ లభించింది. ఫస్ట్ టైం ఈ మూవీ కి 19.62 "టి ఆర్ పి" రేటింగ్ దక్కింది. రెండవ సారి 8.02 ... 3 వ సారి 6.37 ... 4 వ సారి 4.14 "టి ఆర్ పి" రేటింగ్ దక్కింది. ఈ మూవీ కి 2 ... 3 ... 4 సార్లు కంటే ఎక్కువగా 5 వ సారి 8.17 "టి ఆర్ పి" ని దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: