ఇప్పటి వరకు ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించి ఆ మూవీ లతో ఇండియా లోనే గొప్ప దర్శకుడుగా పేరు తెచ్చుకున్న శంకర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే శంకర్ ఆఖరుగా రజినీ కాంత్ హీరో గా రూపొందిన రోబో 2 0 మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితమే శంకర్ , కమల్ హాసన్ హీరో గా ఇండియన్ మూవీ కి సీక్వెల్ గా ఇండియన్ 2 మూవీ ని మొదలు పెట్టాడు.

మూవీ కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత కొన్ని అని వార్య కారణాల వల్ల ఈ షూటింగ్ మధ్య లోనే ఆగిపోయింది. దానితో శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా మరో మూవీ ని మొదలు పెట్టాడు. ఈ మూవీ మొదలు అయిన తర్వాత శంకర్ "ఇండియన్ 2" మూవీ షూటింగ్ ను కూడా తిరిగి ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ రెండు మూవీ ల షూటింగ్ లను కూడా శంకర్ పూర్తి చేస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ కి "గేమ్ చేంజర్" అనే టైటిల్ ను చిత్ర బృందం ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ రెండు మూవీ లను ఎప్పుడు విడుదల చేయాలి అనే విషయంపై శంకర్ క్లారిటీ తో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇండియన్ 2 మూవీ.ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనుండగా  ... రామ్ చరణ్ హీరో గా రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ కానకగా విడుదల చేయాలి అని శంకర్ పిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ రెండు మూవీ లపై కూడా ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: