మెగాస్టార్ చిరంజీవి పోయిన సంవత్సరం ఆచార్య మరియు గాడ్ ఫాదర్ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో ఆచార్య మూవీ ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహ పరచగా గాడ్ ఫాదర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం చిరంజీవి "వాల్టేరు వీరయ్య" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి "భోళా శంకర్" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ని ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా  ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... కీర్తి సురేష్మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ ని ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే చిరంజీవి "భోళా శంకర్" మూవీ తర్వాత యువి క్రియేషన్స్ బ్యానర్ లో ఒక మూవీ చేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి ... యు వి క్రియేషన్స్ బ్యానర్ లో చేయబోయే సినిమాకు బింబిసారా మూవీ కి దర్శకత్వం వహించినటువంటి మల్లాడి వశిష్ట దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ దర్శకుడు చిరంజీవి కి ఒక కథను వినిపించగా ... ఆ కథ బాగా నచ్చిన చిరంజీవి వెంటనే ఈ దర్శకుడి దర్శకత్వంలో పనిచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: