ఈ సినిమాని ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అనౌన్స్మెంట్ చేశారు.. ఈ సినిమాను ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ పైన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.. మెల్బోర్న్ లోని ఐమాక్స్లో ఈ చిత్రాన్ని మే 20వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది.దీంతో ఈ సినిమా రిలీజ్ తో కూడా మంచి హైట్ క్రియేట్ చేస్తోందని అభిమానులు కూడా భావిస్తున్నారు. ఈ చిత్రంలో భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించడం జరిగింది సంగీతాన్ని ఎం ఎం కీరవాణి అందించారు.
సింహాద్రి సినిమా స్పెషల్ ఉదయం 5 గంటల నుంచి ప్రారంభం కాబోతున్నాయి ఇప్పటికే ఆస్ట్రేలియాలోని ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్ లో కూడా ఈ సినిమా విడుదల కాబోతోంది యూఎస్ఏ లో కూడా భారీ స్క్రీన్స్సులో ఈ సినిమా విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి కలెక్షన్ లో పరంగా ఏ మేరకు రికార్డు సృష్టిస్తుంది చూడాలి మరి. ప్రస్తుతం ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా కూడా మాస్ ఆడియన్స్ ని అలరించే విధంగా ఉండబోతున్నట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి