
పోస్టర్‌తో బాగానే ఆకట్టుకున్నప్పటికీ టీజర్ లాంచింగ్ టైమును మాత్రం ఈ నెల 27న సాయంత్రం 6:30 నిమిషాలకు టీజర్ లాంచ్ చేయబోతున్నట్లుగా తెలియజేయడం జరిగింది. విశాల్ బ్యాక్ డ్రాప్ లో గన్స్ కనిపిస్తూ ఉండగా చేతిలో ఒక మొబైల్ పట్టుకొని కనిపిస్తున్నారు. మార్కు ఆంటోనీకి జీవి ప్రకాష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తూ ఉన్నారు. అయితే ఇందులో నటిస్తున్న ఎస్ జె సూర్య ,సెల్వరాఘవ ,సునీల్ వంటి పాత్రలు ఎలా ఉండబోతున్నాయో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని మినీ స్టూడియో బ్యానర్ పై వినోద్ కుమార్ తెలకెక్కిస్తూ ఉన్నారు.
ఇందులో విశాల్ సరసన హీరోయిన్ రీతు వర్మ నటిస్తోంది. విశాల్ దీంతో పాటు స్వీయ దర్శకత్వంలో తుప్పరివాలన్ -2 చిత్రంలో చేస్తున్నారు. యాక్షన్ త్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ సినిమా సరికొత్త డిటెక్టివ్ ఫిలిమ్‌ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఈ విషయం మాత్రం ఇప్పుడు వైరల్ గా మారుతోంది. విశాల్ నటించిన కథ సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కించాయి కానీ ఫ్లాప్ గా మిగిలాయి.. మరి ఈసారి మార్కు ఆంటోని సినిమాతో నైనా అభిమానులను మెప్పిస్తారేమో చూడాలి మరి. గత కొద్ది రోజులుగా హీరో విశాల్ పెళ్లి విషయంపై కూడా పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.