వీరిద్దరు విడిపోయి ఇప్పటికి రెండేళ్లు కావస్తున్న ఎందుకు విడిపోయారు అనే విషయంపై ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. కానీ వీరి విడిపోవడానికి కారణాలు మాత్రం ఇదేనంటూ చైతన్య నిన్నటి రోజున కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా స్పందించడం జరిగింది. సమంతతో తాను గడిపిన రోజులన్నీ ఎక్కువగా గౌరవిస్తానని ఆమె చాలా లవ్లీ పర్సన్ అని తన మాజీ భార్య పైన ప్రశంశాల వర్షం కురిపించారు చైతన్య. అలాగే సమంత ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటానని తెలిపింది. నాగచైతన్య చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.తాజాగా సమంత తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక పోస్ట్ అందరిని ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉంది తన ఇంస్టాగ్రాములు మనమంతా ఒక్కటే కేవలం అహంకారం భయాలు మనమల్ని దూరం చేస్తాయి అంటూ ఒక కొటేషన్ ని షేర్ చేసింది. చైతన్య కామెంట్స్ కి సమంత ఇలా పోస్ట్ చేయడంతో ఇప్పుడు వీరిద్దరి కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. దీంతో వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి అభిమానం గౌరవం ఉన్నాయని కానీ మధ్యవర్తుల కారణంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఈగోల వల్లే విడివిడిపోయారంటూ ఈ సందేశం తెలియజేస్తోంది. కేవలం సమంత ,చైతన్య మీద ఉండే ప్రేమతోనే ఇలా చేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం ఎందాక వెళ్తుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి