
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మార్కెట్ పెంచిన సినిమాల లిస్టులో ‘బాహుబలి’ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలు ఉంటాయని అయితే వచ్చే సంవత్సరం విడుదల కాబోయే ‘ప్రాజెక్ట్ కె’ తరువాత ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంతా ‘ప్రాజెక్ట్ కె’ గురించి మాత్రమే మాట్లాడుకుంటుందని రానా జోశ్యం చెప్పాడు. అంతేకాదు తెలుగు సినిమాల మేకింగ్ లో విప్లవాత్మకమైన మార్పులు ‘ప్రాజెక్ట్ కె’ తరువాత వస్తాయని రానా అభిప్రాయ పడుతున్నాడు.
ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలను తీసిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుండి వస్తున్న మొట్టమొదటి పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కె’ అని అంటున్నాడు. ప్రభాస్ ఈమూవీ తరువాత గ్లోబల్ స్టార్ గా మారిపోతాడు అని ఆశపడుతున్న అతడి అభిమానుల అంచనాలను పెంచే విధంగా రానా కామెంట్స్ ఉన్నాయి అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా ఈమూవీలోని నెగిటివ్ షేడ్ పాత్రలో నటించే విషయంలో తన అంగీకారం తెలపవలసిందిగా కమలహాసన్ పై ఒత్తిడి ఈమూవీ నిర్మాతలు మరింత పెంచినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈమూవీలో అమితాబ్ దీపికా పదుకొనె లాంటి టాప్ సెలెబ్రెటీలు నటిస్తున్న పరిస్థితులలో ఇప్పుడు కమలహాసన్ కూడ ఈమూవీ ప్రాజెక్ట్ లో జాయిన్ అయితే నిజంగానే రానా చెప్పిన మాటలు నిజం అయ్యే ఆస్కారం ఉంది. వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈమూవీ 1000 కోట్ల కలక్షన్స్ మూవీగా మార్చాలని దర్శకుడు నాగ్ అశ్విన్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు..