
ఇక వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త అధికారకంగా ప్రకటించడంతో వీరికి సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నటించిన మిస్టర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇందులో భాగంగా ఈమె వరుణ్ తేజ్ హైట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.వరుణ్ తేజ్ ఆరడుగుల అందగాడు అనే విషయం మనకు తెలిసిందే. అయితే యాంకర్ ప్రశ్నిస్తూ మీరు ఇంత హైట్ ఉన్నారు కదా మీ పక్కన లావణ్య కొన్ని సీన్స్ చేయడానికి ఎలా కష్టపడ్డారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు లావణ్య త్రిపాఠి సమాధానం చెబుతూ నేను వరుణ్ గారి పక్కన నిలబడి కొన్ని సన్నివేశాలలో నటించాలి అంటే కింద బాక్సులు వేసుకొని నటించాల్సి వచ్చిందంటూ వరుణ్ తేజ్ హైట్ గురించి లావణ్య త్రిపాఠి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ శీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ సినిమా ద్వారా వీరిద్దరూ జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ఆ ప్రేమ ఇలా పెళ్లి బంధం వైపు అడుగులు వేసేలా చేసిందని తెలుస్తోంది.