తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఆహనా పెళ్ళంట, పూలరంగడు వంటి సినిమాల ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు డైరెక్టర్ వీరభద్రం చౌదరి .ఈ రెండు సినిమాలు కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి.ఇక ఈ సినిమాల తర్వాత వీరభద్రం చౌదరి దర్శకత్వంలో నాగార్జున రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా బాయ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాని స్వయంగా నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు. ఇది కూడా యాక్షన్ కామెడీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఘోర పరాజయం ఎదుర్కొంది.

ఇక ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోవడంతో నిర్మాతగా ఉన్నటువంటి నాగార్జునకు భారీగానే నష్టాలు వచ్చాయి. అయితే ఈ సినిమా డిజాస్టర్ అని తెలిసినప్పుడు నాగార్జున మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను ఈ సినిమాలో చాలా బాగా నటించాను దర్శకుడు ఎలా చెబితే అలా చేశానని చెబుతూనే ఈ సినిమా డిజాస్టర్ బాధ్యత దర్శకుడుదేనని తెలియజేశారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన ఈ సినిమా గురించి కొన్ని విషయాలను తెలియజేశారు..నిజానికి ఈ సినిమా కామెడీ నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యాము. కానీ నాగార్జున హీరో అనేసరికి స్క్రిప్ట్ లో మార్పులు వచ్చాయని తెలిపారు. ఇలా స్క్రిప్ లో మార్పులు చేసే సమయంలో ఎక్కడో మిస్ ఫైర్ అయిందని అందుకే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను రీచ్ కాలేక పోయింది అంటూ వీరభద్రం చౌదరి తెలిపారు.ఈ సినిమా తనని కోలుకోలేని దెబ్బ కొట్టిందని ఫ్లైట్లో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తిని కిందకి తోస్తే ఎలా ఉంటుందో తన పరిస్థితి కూడా అలాగే మారిపోయిందని తెలిపారు. తాను ఇలాంటి పరిస్థితికి రావడానికి నాగార్జున సినిమానే కారణమని ఈయన తెలియజేశారు. ఈ సినిమా తర్వాత తాను పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని వీరభద్రం చౌదరి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమా ఫ్లాప్ కావడానికి డైరెక్టర్ కారణం అంటూ నాగార్జున అన్న వ్యాఖ్యల పైస్పందించిన ఈయన ఒక సినిమా ఫ్లాపైన హిట్ అయిన పూర్తి బాధ్యత దర్శకుడికి ఉంటుందని తెలిపారు. తాను చేసిన రెండు సినిమాలు హిట్ అయి మూడో సినిమా ఫ్లాప్ అయింది అంటే అది కూడా నా బాధ్యతను అంటూ ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: