నటుడిగా ... దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సముద్ర కని ఒకరు. ఈయన తమిళ సినిమాల ద్వారా కెరియర్ ప్రారంభంలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తరువాత ఈ నటుడుకి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి కూడా మంచి అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే అనేక తెలుగు సినిమాలలో విలన్ పాత్రలలోనూ మరియు ఇతర ముఖ్య పాత్రలలోను నటించిన సముద్ర ఖని టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే సముద్ర ఖని సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన సర్కారు వారి పాట సినిమాలో విలన్ పాత్రలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

అలాగే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ... జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇలా నటుడిగా తనకంటూ ఒక సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈయన దర్శకుడిగా కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈయన దర్శకత్వంలో రూపొంది మంచి విజయం సాధించిన సినిమాలలో వినోదయ సీతం మూవీ ఒకటి. ప్రస్తుతం ఈ మూవీ ని సముద్ర ఖని తెలుగు లో "బ్రో" అనే పేరుతో రీమేక్ చేస్తున్నాడు. బ్రో మూవీ లో పవన్ సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ మూవీ ని జూలై 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా సముద్ర కని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

ఆ ఇంటర్వ్యూలో భాగంగా సముద్ర కనికి పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేసే అవకాశం ఉందా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు సముద్ర ఖని సమాధానం ఇస్తూ ... పవన్ కళ్యాణ్ తో 100 సినిమాలు చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. అలాగే అందుకు సంబంధించి అనేక కథలు కూడా ఉన్నాయి. ఆయన కనక సినిమా చేయమని ఒక మాట అడిగితే వెంటనే సినిమా చేస్తాను అని సముద్ర ఖని తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: