రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ జూన్ 16 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఈ మూవీ బృందం తిరుపతి లో భారీ ఎత్తున నిర్వహించింది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్రం బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఆది పురుష్ మూవీ కి సంబంధించిన టికెట్ లని కొంత మంది సెలబ్రిటీలు భారీ మొత్తంలో కొనుగోలు చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. అలా ఈ మూవీ కి సంబంధించిన టికెట్ లను ఏ సెలబ్రిటీలు ... ఎంత సంఖ్యలో కొనుగోలు చేశారు అనే విషయాలను తెలుసుకుందాం.

అభిషేక్ అగర్వాల్ ఈ మూవీ కి సంబంధించిన పది వేల టికెట్ లను కొనుగోలు చేశాడు.

బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి రన్బీర్ కపూర్ ఈ మూవీకి సంబంధించిన పది వేల టికెట్ లను కొనుగోలు చేశాడు.

అనన్య బిర్లా ఈ మూవీ కి సంబంధించిన పది వేల టికెట్ లను కొనుగోలు చేసింది.

పి సిరీస్ సంస్థ వారు ఈ మూవీ కి సంబంధించిన 12000 టికెట్ లను కొనుగోలు చేశారు.

మంచు మనోజ్ మరియు అతని భార్య అయినటువంటి భూమా మౌనిక కలిసి ఈ మూవీ కి సంబంధించిన 2500 టికెట్ లను కొనుగోలు చేశారు.

శ్రేయస్ మీడియా సంస్థ వారు ఖమ్మం జిల్లాలో ప్రతి ఊరిలో ఉన్న రామాలయానికి 101 టికెట్ల చొప్పున కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. 

ఇలా ఈ సెలబ్రిటీలు ఆది పురుష్ మూవీ కి సంబంధించిన టికెట్ లను భారీ మొత్తంలో కొనుగోలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: