తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు పెళ్లి చూపులు మూవీ తో హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి ... గీత గోవిందం ... టాక్సీవాలా మూవీ ల విజయాలతో ఈ నటుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోగా మారిపోయాడు. ఇది ఇలా ఉంటే ఆఖరిగా ఈ నటుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటించాడు.

బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇలా లైగర్ మూవీ తో భారీ డిజాస్టర్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న విజయ్ ప్రస్తుతం శివ నర్వన దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. సమంతమూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 1 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత విజయ్ ... పరుశురామ్ పేట్ల దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాలో విజయ్ పక్కన నటించే హీరోయిన్ ను కన్ఫామ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ మేకర్స్ త్వరలోనే ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: