డీసీ స్టూడియోస్ సినిమాటిక్ యూనివర్స్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ది ఫ్లాష్’. ఈ మూవీ ప్రస్తుతం ఉన్న యూనివర్స్ను రీసెట్ చేయనుంది. అంటే ‘డీసీ ఎక్స్టెండెడ్ యూనివర్స్ (DCEU)’ లో ఇదే చివరి సినిమా. 2023 ఆగస్టు నుంచి రానున్న ‘బ్లూ బీటిల్ (Blue Beetle)’తో ‘డీసీ యూనివర్స్ (DCU)’ అనే కొత్త యూనివర్స్ను డీసీ స్టార్ట్ చేయనుంది.ఒక సినిమాటిక్ యూనివర్స్ను రీసెట్ చేయడం అంటే అసలు చిన్న విషయం కాదు. దాన్ని కన్విన్సింగ్గా చూపించేందుకు ఇద్దరు బ్యాట్మ్యాన్లు, ఇద్దరు ఫ్లాష్లు అలాగే సూపర్ గర్ల్, ఇంకా మరెందరో సూపర్ హీరోలు గెస్ట్ రోల్స్ లో కనిపించనున్నారు.ఈ సినిమా ట్రైలర్ కూడా మంచి యాక్షన్ ప్యాక్డ్గా కట్ చేయడంతో ఈ సినిమాపై అభిమానులకు అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


కథ విషయానికి వస్తే.. హీరో బ్యారీ ఆలెన్ / ది ఫ్లాష్ (ఎజ్రా మిల్లర్) క్రిమినల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో పని చేస్తూనే సూపర్ హీరోగా ప్రజలను రక్షిస్తూ ఉంటాడు. అయితే బ్యారీ తల్లి హత్య కేసులో అతని తండ్రికి అకారణంగా శిక్ష పడే పరిస్థితి వస్తుంది. దీంతో తనకు ఉన్న శక్తులను వాడి టైమ్ ట్రావెల్ ద్వారా తన తల్లిని చనిపోకుండా కాపాడాలని అతను అనుకుంటాడు. ఈ విషయాన్ని బ్యాట్మ్యాన్/బ్రూస్ వెయిన్ (బెన్ ఆఫ్లెక్)కి చెప్తే అతను వారిస్తాడు. గతాన్ని మార్చడం భవిష్యత్తును అతలాకుతలం చేస్తుందని అతను హెచ్చరిస్తాడు. కానీ అతని మాటలు వినకుండా బ్యారీ టైమ్ ట్రావెల్ చేసి వెనక్కి వెళ్లి తల్లిని కాపాడతాడు.ఇక తిరిగి తన కాలానికి వచ్చేటప్పుడు మధ్యలో ఒక గుర్తు తెలియని వ్యక్తి అడ్డుకోవడంతో 2013 సంవత్సరంలోనే అతను స్టక్ అయిపోతాడు. అయితే తను వచ్చింది తన ప్రపంచానికి కాదని, మల్టీవర్స్లో ఉన్న మరో భూగ్రహం మీదకి వచ్చాడని  ఆ తర్వాత అతనికి తెలుస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగింది? అసలు తిరిగి వచ్చేటప్పుడు బ్యారీని అడ్డుకున్నది ఎవరు? ఇంకా చివరికి ఏం అయింది? అనేది తెలియాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే.


సినిమా మొత్తం అయిపోయాక చివర్లో వచ్చే సర్ప్రైజ్ ట్విస్ట్ తర్వాతి భాగంపై మంచి ఆసక్తిని ఒక్కసారిగా పెంచుతుంది.టెక్నికల్గా కూడా ‘ది ఫ్లాష్’ చాలా సూపర్. వీఎఫ్ఎక్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది. బెంజమిన్ వాల్ఫిష్ అందించిన సౌండ్ ట్రాక్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్లను చాలా ఉత్కంఠభరితంగా మారుస్తాయి.ఈ సినిమా నిడివి రెండున్నర గంటలుగా ఉంది. సినిమా ప్రారంభంలో కథలోకి వెళ్లడానికి కొంచెం సమయం తీసుకుంటారు తప్ప ఇంక ఎక్కడా కూడా ల్యాగ్ అని  అనిపించదు.మొత్తానికి సినిమా సూపర్. హ్యాపీగా చూసేయొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: