ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్స్ గా ఎదిగిన వాళ్ళను మనం చాలా తక్కువ గా చూసి ఉంటాము.కొంతమంది అందం , టాలెంట్ అన్నీ ఉన్నప్పటికీ కూడా అదృష్టం సరిగా లేక కనీసం మీడియం రేంజ్ హీరోయిన్ అని కూడా అనిపించుకోలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.అలాంటి వాళ్ళు ఉన్న ఈ ఇండస్ట్రీ లో, కేవలం రెండేళ్లలోనే స్టార్ హీరోయిన్స్ అందరినీ వెనక్కి నెట్టి, చిన్న హీరోల దగ్గర నుండి, పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు వంటి స్టార్ హీరోల వరకు మా సినిమాల్లో ఆమె హీరోయిన్ గా ఉండాలి అని పట్టుబట్టేంత రేంజ్ కి ఎదిగిన హీరోయిన్ శ్రీలీల.శ్రీకాంత్ కొడుకు రోహన్ మొదటి సినిమా పెళ్లి సందడితో ఆమె ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది.ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఈమెకి మాస్ మహామరాజ రవితేజ హీరో గా నటించిన ధమాకా చిత్రం లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది.

సినిమా పెద్ద హిట్ అవ్వడం తో ఈ అమ్మడికి క్రేజ్ మామూలు రేంజ్ లో పెరగలేదు.వరుసగా 8 సినిమాల్లో ఆఫర్స్ కొట్టేసింది.వాటిల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మరియు నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి వంటి టాప్ హీరోల సినిమాలు ఉన్నాయి.ఇక ఆ తర్వాత రామ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ,నితిన్ తో ఒక సినిమా, పంజా వైష్ణవ్ తేజ్ ఆది కేశవ్ అనే సినిమా, నవీన్ పోలిశెట్టి తో మరో సినిమా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ విజయ్ దేవరకొండ మరియు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.వీటితో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఆహా మీడియా లో ఒక సినిమా ఒప్పుకుంది, మెగాస్టార్ చిరంజీవి - వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా ఒక కీలక పాత్ర కోసం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఇలా ఆమె తన క్యాలండర్ ని మరో రెండేళ్ల పాటు నింపేసుకుంది.ఒక్కో సినిమాకు ఈమె రెండు నుండి మూడు కోట్ల రూపాయిలు తీసుకుంటుంది.అలా ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాల పారితోషికాలు మొత్తం కలుపుకొని చూస్తే కేవలం 8 సినిమాల ద్వారా ఆమె 40 కోట్ల రూపాయిలు అందుకుందని సమాచారం.ఇదంతా కేవలం రెండేళ్ల సినీ కెరీర్ అనుభవం తో సంపాదించిన కీర్తి ప్రతిష్టలు.ఇంత తొందరగా ఇండస్ట్రీ లో దూసుకెళ్లిన హీరోయిన్స్ నేటి తరం లో ఎక్కడా లేరు.గతం లో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దివ్యభారతి కి ఈ రేంజ్ ఉండేది.ఆ తర్వాత ఆ స్థాయిని చూస్తుంది మాత్రం శ్రీలీల నే అని చెప్పుకోవాలి.ఈమెకి ఇంకా తమిళ ఇండస్ట్రీ నుండి పిలుపు రాలేదు.ఒక్కసారి తమిళ సినిమాలు కూడా ఒప్పుకుంటే ఈమె ఏ రేంజ్ కి భవిష్యత్తులో వెళ్లబోతుందో ఊహించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: