కర్ణాటక రాష్ట్ర సరిహద్దులలో బెంగుళూరు హైవేని ఆనుకుని ఉన్న తొండుపల్లి కొత్తూరు గ్రామాల మధ్య హైవే విస్తరణ కార్యక్రమంలో భాగంగా పచ్చని చెట్లను నరికిన సంఘటన రాజమౌళికి తీవ్ర మనోవేదనను అదేవిధంగా అసహనాన్ని కలిగించింది. ఈ ప్రాంతం దగ్గరలో చౌటుప్పల్ ప్రాంతంలో రాజమౌళికి సువిశాలమైన ఫామ్ హౌస్ ఉంది.
ఆ ఫామ్ హౌస్ ప్రాంతంలో 15 పచ్చని చెట్లను కొట్టివేసిన సంఘటన జక్కన్న దృష్టికి రావడంతో తన తీవ్ర అసహనాన్ని తెలియ చేస్తూ సోషల్ మీడియాలో ఘాటైన విమర్శలు చేశాడు. ఈ కామెంట్స్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకుల దృష్టి వరకు రావడంతో వారు రాజమౌళిని అభినందిస్తూ కామెంట్స్ పెట్టారు. అంతేకాదు సమాజంలోని ప్రతి వ్యక్తి వృక్షాలను ఈవిధంగా ప్రేమిస్తే దేశంలో చెట్లు నరకడం అన్న సంఘటన ఎప్పుడు జరగదు అంటూ ఆ సంస్థ నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.
వాస్తవానికి పాశ్చాత్య దేశాలలో చెట్లు నరకడం చాల పెద్ద నేరం ఒక చెట్టును నరకాలి అంటే ప్రభుత్వ అనుమతులు కావాలి. అయితే మన దేశంలో అలాంటి పద్దతి అమలులో లేదు. దీనివలన ఎవరైనా వారికి ఇష్టం వచ్చినట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు వారికి ఇష్టం వచ్చినట్లు వారి స్వార్థం కోసం చెట్లు నరుకుతూనే ఉన్నారు. దీనితో పచ్చదనం తగ్గి వర్షాలు రాక కరువు పరిస్థితులు ఏర్పడినా పట్టించుకునే ఆలోచన ప్రభుత్వానికి కాని ప్రజలకు కాని లేదు అన్నది నిజం. రాజమౌళి అభిమానించే అభిమానులు ఆయన పడుతున్న ఆవేదనను అర్థం చేసుకుంటే బాగుంటుంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి