నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచిన చిత్రం భైరవద్వీపం.. ఈ చిత్రంలో హీరోయిన్ గా రోజా అద్భుతమైన నటనను కనబరిచింది.తెలుగు సినీ ఇండస్ట్రీలో శాశ్వతంగా నిలిచిపోయి అద్భుతమైన చిత్రాలలో ఈ చిత్రం కూడా ఒకటి.ఈ చిత్రాన్ని ప్రముఖ లెజెండ్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఒక సరీ కొత్త ప్రపంచాన్ని సృష్టించింది. 1994 ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పలు రికార్డులను కూడా సృష్టించినట్లు తెలుస్తోంది.


ఎప్పటికీ ఎవరి గ్రీన్ క్లాసికల్ చిత్రాలలో గుర్తుండి పోయేలా ఉన్నా చిత్రలలో  ఒకటీ.ఈ తరం ప్రేక్షకుల కోసం ఆగస్టు 5వ తేదీన 4k క్వాలిటీతో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు  చిత్ర బృందం పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.. ప్రస్తుతం అయితే ఇదంతా బాగానే ఉన్నా ప్లానింగ్ కరెక్ట్ గా లేదంటూ కొంతమంది అభిమానులు భావిస్తూ ఉన్నారు.. ప్రస్తుతం వర్షాలతో తెలుగు రాష్ట్రాలు చాలా సతమతమవుతున్నాయి ఈ సమయం కాకుండా మంచి సమయం చూసుకొని వదిలితే కచ్చితంగా ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ అందుకుంటుందని నందమూరి అభిమానులు తెలియజేస్తున్నారు.



మరి ఆగస్టు నెలలో బడా సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఇలాంటి సమయంలో థియేటర్లు దొరుకుతాయా అంటే పలువురు అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమా ఒక తెగలలో ఎదుగుతున్న రాజకుమారుడి విజయ్ గా (బాలయ్య) కనిపిస్తారు.. విజయ కార్తికేయ రాజ్యానికి సైతం యువరాణిక( రోజా) కనిపించడం జరిగింది. ఇక ఆమెతో ప్రేమలో పడడం జరుగుతుంది బాలయ్య. యువరాణిని బలి తీసుకోవడానికి భైరవద్వీపం అనే దీపానికి మాయాజాలం ద్వారా తీసుకు వెళుతూ ఉంటారు విజయ్ ఆ తర్వాత చెడుతో పోరాడి యువరాణిని ఎలా కాపాడుతారు అనే విషయమే ఈ సినిమా కథ. మరి రిలీజ్ లో ఎలాంటి ట్రెండ్ కొనసాగుతుందో చూడలి.

మరింత సమాచారం తెలుసుకోండి: